- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్ర నాగమల్లయ్య దారుణ హత్య.. ప్రెసిడెంట్ ట్రంప్ రియాక్షన్ ఇదే
అమెరికా (America)లోని టెక్సాస్ (Texas) స్టేట్‌లో భారత సంతతికి చెందిన చంద్ర నాగమల్లయ్య (Chandra Naga Mallaiah) ఆయన భార్య, కుమారుడి ఎదుట దారణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా (America)లోని టెక్సాస్ (Texas) స్టేట్‌లో భారత సంతతికి చెందిన చంద్ర నాగమల్లయ్య (Chandra Naga Mallaiah) ఆయన భార్య, కుమారుడి ఎదుట దారణ హత్యకు గురైన విషయం తెలిసిందే. క్యూబా (Cuba)కు చెందిన ఓ వ్యక్తి అతడిని కత్తితో దారుణంగా హతమార్చాడు. అయితే, చంద్ర నాగమల్లయ్య హత్యపై తాజాగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ కింద అభియోగాలు నమోదు చేసి విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇక నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతామని వార్నింగ్ ఇచ్చారు. చంద్ర నాగమల్లయ్య డాలస్‌లో మంచి పేరు ఉందని.. అలాంటి వ్యక్తి భార్య, కొడుకు ఎదుట దారుణ హత్యకు గురి కావడం బాధించిందని అన్నారు. తమ దేశానికి సంబంధం లేని క్యూబా దేశానికి చెందిన అక్రమ వలసదారుడు ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడని ప్రెసిడెంట్ ట్రంప్ ట్రూత్ సోషల్ (Truth Social) వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.






