- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Court Cases: గడిచిన పదేళ్లలో కోర్టు కేసుల కోసం రూ.400 కోట్లు ఖర్చు
గడిచిన పదేళ్లలో కేంద్రం కోర్టు కేసుల కోసం రూ.400 కోట్లు ఖర్చు చేసింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సమాధానం ఇచ్చింది.

దిశ, నేషనల్ బ్యూరో: గడిచిన పదేళ్లలో కేంద్రం కోర్టు కేసుల కోసం రూ.400 కోట్లు ఖర్చు చేసింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సమాధానం ఇచ్చింది. 2014-15 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరాల మధ్య గత పదేళ్లలో కోర్టుల్లో వ్యాజ్యాల కోసం రూ. 409 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కోర్టుకు సంబంధించిన పిటిషన్ల కోసం కేంద్రం రూ.66 కోట్లు వ్యయం చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే ఇది రూ.9 కోట్లు ఎక్కువ. 2014-15లో వ్యాజ్యాల కోసం రూ.26.64 కోట్లు, 2015-16లో రూ.37.43 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.
రాజ్యసభలో న్యాయశాఖామంత్రి ఏమన్నారంటే?
అంతేకాకుండా, దేశంలోని పలు కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న సుమారు ఏడు లక్షల కేసుల్లో కేంద్రం ప్రతివాదిగా ఉందని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ రాజ్యసభకు తెలిపారు. సుమారు 1.9 లక్షల కేసుల్లో ఆర్థికమంత్రిత్వ శాఖ మంత్రమే లిటిగెంట్ గా ఉందని పేర్కొన్నారు. లీగల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ బ్రీఫింగ్ సిస్టమ్ డేటా ఆధారంగా ఈ వివరాలు వెల్లడించారు. మరోవైపు పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి ప్రయత్నించే జాతీయ వ్యాజ్య విధానంపై ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు అర్జున్ రామ్ మేఘావాల్ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా మార్పులు చేర్పులతో పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదిత ముసాయిదాపై కేంద్ర మంత్రివర్గం త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.






