- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చాబహార్ ఓడ రేవుపై అమెరికా ఆంక్షలు
చాబహార్ పోర్టులో మౌలిక వసతులను పెంచడానికి ఇండియా ఒక టెర్మినల్‌ను నిర్మించింది. దీనికి మాజీ అధ్యక్షుడు బైడెన్ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు.

- ఉత్తర్వులపై సంతకం చేసిన ప్రెసిడెంట్ ట్రంప్
- ఇరాన్ ఓడరేవులో పెట్టుబడులు పెట్టిన భారత్
- ట్రంప్ ఉత్తర్వులపై కేంద్ర ప్రభుత్వం మౌనం
దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ ప్రభుత్వంపై ఆర్థిక పరమైన ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగా అమెరికా ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ ప్రెసిడెన్షియల్ మెమోరాండం అనే శీర్షికతో ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఉత్తర్వులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఇరాన్‌లో చమురు ఎగుమతులు, ఓటరేవులు, అనుబంధ వ్యాపారాల కోసం నిధులను ఇవ్వడాన్ని నిషేధిస్తూ అమెరికా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ కార్యదర్శి మార్కొ రుబియో, ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్‌లను ఆదేశించింది. ఇరాన్‌కు ఆర్థిక ఉపశమనం కలిగించే ఆంక్షలను తొలగించడం, సవరించడం అవసరమైతే రద్దు చేయడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. కాగా, ఆఫ్గానిస్తాన్ అధ్యక్షుడిగా అష్రఫ్ ఘనీ ఉన్నప్పుడు ఇరాన్ ఓడరేవు ద్వారా ఆఫ్గానిస్తాన్ తూర్పు సరిహద్దుకు ఇండియా నుంచి ఆహారం, వస్తువులను తరలించడానికి మినహాయింపులను పొందింది. 2021లో ఆఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఆహార ధాన్యాలు, ఇతర సామాగ్రిని అక్కడకు తరలిస్తున్నారు. చాబహార్ పోర్టులో మౌలిక వసతులను పెంచడానికి ఇండియా ఒక టెర్మినల్‌ను నిర్మించింది. దీనికి మాజీ అధ్యక్షుడు బైడెన్ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. 2024 మేలో షిప్పింగ్ మంత్రి సర్పానంద సోనోవాల్.. చాబహార్ టెర్మినల్ అభివృద్ధి కోసం 10 ఏళ్ల ఒప్పందం చేసుకున్నారు. రష్యా, మధ్య ఆసియాతో వాణిజ్యం కోసం ఈ పోర్టును ఉపయోగించుకోవాలని ఇండియా భావిస్తోంది. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఇండియాకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవడానికి కూడా భారత్‌కు ఇబ్బంది కలుగనున్నది. దీని వల్ల మన దేశానికి చౌకైన చమురు దొరికే అవకాశం పోతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు దీనిపై స్పందించలేదు. ట్రంప్ ఉత్తర్వుల పర్యవసానాలపై కేంద్ర మౌనంగానే ఉంది.






