పాకిస్తాన్‌ మీడియాపై నిషేధం ఎత్తివేసిన కేంద్రం

by Gantepaka Srikanth |

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) వేళ పాకిస్తాన్‌(Pakistan) మీడియాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.

పాకిస్తాన్‌ మీడియాపై నిషేధం ఎత్తివేసిన కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) వేళ పాకిస్తాన్‌(Pakistan) మీడియాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. పాక్‌ సెలబ్రిటీల అకౌంట్లపైనా బ్యాన్‌ ఎత్తివేసింది. ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండానే వారి ఇన్‎స్టా గ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ ఎత్తేసింది. మాజీ పాక్ స్టార్ క్రికెటర్ షాహిదీ ఆఫ్రిదీ, సబా కమర్, మావ్రా హొకేన్, అహద్ రజా మీర్, హనియా అమీర్, యుమ్నా జైదీ, డానిష్ తైమూర్ వంటి అనేక మంది పాకిస్తానీ ప్రముఖుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు భారత్‎లో ఓపెన్ అవుతున్నాయి. కాగా, జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గాంలో ఉగ్రవాదులు భారత టూరిస్టులను దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారతదేశానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో పాకిస్తాన్ మీడియా, ప్రముఖులపై భారత్ నిషేధించింది.

Next Story