- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రసార భారతికి నూతన చైర్మన్ నియామకం.. ఎవరీ ప్రసూన్ జోషి?
ప్రసార భారతి బోర్డు ఛైర్మన్‌గా ప్రసూన్ జోషిని కేంద్రం నియమించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతి (Prasar Bharati) బోర్డు ఛైర్మన్‌గా ప్రసూన్ జోషిని(Prasoon Joshi) కేంద్ర ప్రభుత్వం నియమించింది. గతంలో ఈ పదవిలో ఉన్న నవనీత్ కుమార్ సెహగల్ రాజీనామా చేయడంతో అతడి స్థానంలో జోషిని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం నియమించింది. సాహిత్యం, ప్రకటనలు, సినిమా, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ రంగాలలో విస్తృతమైన సేవలందించిన ప్రముఖ సృజనాత్మక నిపుణుడైన జోషి 2017 నుండి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఛైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. ప్రసూన్ జోషి గతంలో మెక్‌కాన్ వరల్డ్ గ్రూప్ ఇండియాకు CEOగా, మెక్‌కాన్ వరల్డ్ గ్రూప్ ఆసియా పసిఫిక్‌కు ఛైర్మన్‌గా పనిచేశారు. 2016 నుండి ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ (IGNCA) ట్రస్టీలలో ఒకరిగా ఉన్నారు.
కేంద్ర మంత్రి అభినందనలు:
ప్రసూన్ జోషి నియామకంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రసూన్ జోషి ఒక అరుదైన సృజనాత్మక శక్తి కలిగిన వ్యక్తి అని ఆయన నేతృత్వంలో ప్రసార భారతి సరికొత్త శక్తిని, ఉద్దేశ్యాన్ని, సృజనాత్మక స్వరాన్ని సంతరించుకుంటుందని పేర్కొన్నారు. కాగా గతంలో ఛైర్మన్‌గా ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి నవనీత్ సెహగల్ తన పదవీ కాలం మరో ఏడాది ఉండగానే 2025 డిసెంబర్‌లో ఆయన అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దీంతో ఆ ఖాళీని ప్రసూన్ జోషితో భర్తీ చేశారు.






