- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tahawwur Rana: తహవ్వూర్ రాణా కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మన్‌ను నియమించిన కేంద్రం
ఈ నియామకం మూడేళ్ల కాలానికి లేదా విచారణ ముగిసే వరకు, ఏది ముందు అయితే అప్పటివరకు అమల్లో ఉంటుంది.

దిశ, నేషనల్ బ్యూరో: ముంబై 26/11 దాడుల కేసు వ్యవహారంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) తరపున వాదనలు వినిపించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా న్యాయవాది నరేందర్ మన్‌ను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియమించింది. అధికారిక ఉత్తర్వుల ప్రకారం.. ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులతో పాటు అప్పిలేట్ కోర్టుల ముందు మన్ ఈ కేసులో తహవ్వూర్ హుస్సేన్ రాణా, డేవిడ్ కోల్‌మన్ హెడ్లీకి వ్యతిరేకంగా ఎన్ఐఏ తరపున వాదిస్తారు. ఈ నియామకం మూడేళ్ల కాలానికి లేదా విచారణ ముగిసే వరకు, ఏది ముందు అయితే అప్పటివరకు అమల్లో ఉంటుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్, 2008, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), 2023 కింద ఈ నియామకం జరిగింది. 26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారి అయిన తహవ్వూర్ రాణా పాకిస్తాన్‌కు చెందిన కెనడా దేశస్థుడు. అమెరికా జాతీయుడైన డేవిడ్ కోల్‌మన్ హెడ్లీకి అత్యంత సన్నిహితుడు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న ఆరోపణలతో 2009 అమెరికాలో అరెస్ట్ అయ్యాడు. అమెరికాలో చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రస్తుతం భారత్‌కు తీసుకువస్తున్నారు. భారత్‌లో దిగిన అనంతరం అతడిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేయనున్నారు. అనంతరం ఢిల్లీలోని తీహార్ జైలులో తరలిస్తారు. ఒకప్పుడు పాకిస్తాన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో కెప్టెన్ స్థాయిలో పనిచేసిన తహవ్వూర్ రాణా ఆ తర్వాత ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థను ప్రారంభించాడు. 2008, నవంబర్ 26న ముంబై దాడుల వెనుక ఉన్న పాక్ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయిబాతో సంబంధాలు ఉన్నాయి. ఆనాడు జరిగిన దాడుల్లో 18 మంది భద్రతా సిబ్బంది, 166 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గాయాల పాలయ్యారు.






