ముగిసిన కేంద్ర జలవివాదాల పరిష్కార కమిటీ సమావేశం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-30 12:41:15  IST  )

ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల నీళ్ల పంచాయతీపై కేంద్ర జలవివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది.

ముగిసిన కేంద్ర జలవివాదాల పరిష్కార కమిటీ సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల నీళ్ల పంచాయతీపై కేంద్ర జలవివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం దాదాపు 2 గంటలపాటు కొనసాగింది. ఈ సమావేశంలో తెలంగాణ 12 అంశాలను ప్రతిపాదించగా.. పలు అంశాలకు ఏపీ అభ్యంతరం తెలిపింది. అజెండాలో 12 అంశాలను చేర్చాలని, పోలవరం, నల్లమలసాగర్ ప్రాజెక్టును చేర్చవద్దని పేర్కొంది. అలాగే ట్రైబ్యునల్ తీర్పు వచ్చేంతవరకూ 50 శాతం నీటిని వాడుకునేందుకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ కోరింది. ఇరు రాష్ట్రాల అభ్యంతరాలు విన్న సీడబ్ల్యూసీ ఛైర్మన్.. వారంరోజుల్లోగా అజెండా ఖరారు చేసి లిఖితపూర్వకంగా ఇవ్వాలని తెలిపారు. ఆ తర్వాతే భేటీ తేదీని ఖరారు చేస్తామని స్పష్టం చేశారు.

Next Story