- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trump Tariff: అమెరికా సుంకాలపై కేంద్రం స్పందన ఇదే
అమెరికా విధించిన సుంకాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) భారత్ దిగుమతులపై సుంకాలు (Tariffs) విధించడంపై కేంద్ర ప్రభుత్వం (Central Govt) స్పందించింది. అమెరికా విధించిన సుంకాల వల్ల తలెత్తే పరిణామాలను పరిశీలిస్తున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (Commerce Ministry) తాజాగా ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు టేసిన టారిఫ్ లు ప్రకటించిన నేపథ్యంలో పారిశ్రామిక వర్గాలు, ఎగుమతిదారులతో సహా అన్ని వాటాదారులతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపింది. భారత్ ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా 27 శాతం అదనపు సుంకం విధించిందని స్పష్టం చేసింది.
2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 500 బిలియన్ల యూఎస్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ, డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 13, 2025న 'మిషన్ 500'ను ప్రకటించారని కేంద్రం పేర్కొంది. ఈ విషయంలో ఇరు దేశాల వాణిజ్య బృందాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొంది. రెండు దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు సాంకేతిక బదిలీలను వృద్ధి చేసుకోవడానికి వీలు కల్పించడంపై దృష్టి సారించాయని ఈ అంశాలపై మేము అమెరికాతో సంప్రదిస్తూనే ఉన్నట్లు వెల్లడించింది.






