Central Govt.: కేంద్రం షాకింగ్ నిర్ణయం.. ఆ టూరిస్ట్ ప్రాంతాల మూసివేత

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-29 04:44:40  IST  )

పహల్గాం టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Central Govt.: కేంద్రం షాకింగ్ నిర్ణయం.. ఆ టూరిస్ట్ ప్రాంతాల మూసివేత
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం టెర్రర్ ఎటాక్ (Pahelgam Terror Attack) నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌లో మరిన్ని ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో కశ్మీర్ (Kashmir) లోయలో ఉన్న మొత్తం 87 ప్రదేశాల్లోని 48 టూరిస్ట్ ప్రాంతాల (Tourist Spots)ను మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. పహల్గాం దాడి అనంతరం కశ్మీర్ లోయలో స్లీపర్‌ సెల్స్‌ యాక్టివేట్‌ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో మెయిన్ సెంటర్లతో కొన్ని పర్యటక ప్రాంతాల్లో సాయుధ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనుంది. ఇక మూసివేయబడిన టూరిస్ట్ ప్రాంతాల్లో త్వరలోనే పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ ఫోర్సెస్‌ను డిప్లాయ్ చేయనున్నారు. మరోవైపు సరిహద్దులో దాయది పాకిస్థాన్ (Pakistan) కవ్వింపు చర్యలు ఆగడం లేదు. ఇవాళ తెల్లవారుజామున అఖ్నూర్ సెక్టార్‌ (Akhnoor Sector)లో పాక్ రేంజర్లు ఆకస్మికంగా కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భారత భద్రతా దళాలు దాడిని సమర్ధవంతంగా తిప్పికొట్టాయి.

Next Story