ఉద్యోగులకు సర్కార్ శుభవార్త.. హోలీ కానుకలు ఇవే!

by Disha Web Desk 2 |
ఉద్యోగులకు సర్కార్ శుభవార్త.. హోలీ కానుకలు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: హోలీ పండుగ సమీపిస్తోన్న నేపథ్యంలో ఉద్యోగులకు హోలీ కానుకలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. జీతాల పెంపు కోసం ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తోన్న ఉద్యోగులకు ఈ హోలీ పండుగ రోజున ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. డీఏ పెంపు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, పెండింగ్‌లో ఉన్న 18 నెలల డీఏపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్రం నుంచి ఈ ప్రకటనలు వెలువడితే ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

హోలీ గిఫ్ట్‌గా ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ పెద్దల నుంచి ఉద్యోగులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 7వ వేతన సంఘం కింద జీతాలు అందజేస్తున్నారు. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేవలం మరో ఏడాది సమయం మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వేతన సవరణకు కొత్త ఫార్ములాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.



Next Story

Most Viewed