కులగణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |

కులగణన(Caste Census)పై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt) కీలక నిర్ణయం తీసుకుంది.

కులగణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: కులగణన(Caste Census)పై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రెండు దశల్లో దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని నిర్ణయించింది. 2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి తొలి దశ కులగణన.. 2027 మార్చి 1వ తేదీ నుంచి రెండో దశ కులగణన చేయనున్నారు. తొలి దశల్లో ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్‌లో కులగణన చేయబోతున్నారు.

మరోవైపు.. కులగణనపై కేంద్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కులగణన పేరుతో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో సర్వే చేయించారని, ఆ సర్వేల్లో పారదర్శకత లేదని కేంద్రం పేర్కొంది. దేశవ్యాప్తంగా పారదర్శకంగా కులగణన చేయాలన్నదే మోడీ ప్రభుత్వ సంకల్పమని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. వచ్చే జనాభా లెక్కల్లోనే దీనిని చేర్చుతామని కేంద్రం ప్రకటించారు.

Next Story