Central Govt.: పహెల్గాం టెర్రర్ అటాక్ ఎఫెక్ట్.. పాక్ యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-28 05:23:24  IST  )

జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Central Govt.: పహెల్గాం టెర్రర్ అటాక్ ఎఫెక్ట్.. పాక్ యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం
X

దిశ, వెబ్‌డెస్క్: పహెల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దాయాది పాకిస్థాన్‌ (Pakistan)కు చెందిన మొత్తం 16 యూట్యూబ్ ఛానళ్ల (Youtube Channels)పై నిషేధం విధించింది. అయితే, భారత సైన్యం, భద్రతా సంస్థలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మతపరమైన కంటెంట్, ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే కథనాలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలో వాటిని బ్యాన్ చేసినట్లుగా తెలుస్తోంది. హోం మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs) సిఫార్సుల మేరకు భారత ప్రభుత్వం (Indian Government) మొత్తం 16 పాకిస్థాన్ యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించింది. బ్యాన్ చేసిన యూట్యూబ్ ఛానళ్లలో డాన్ న్యూస్, సమా టీవీ, ARY న్యూస్, ఇర్షాద్ భట్టి, బోల్ న్యూస్, రఫ్తార్, ది పాకిస్థాన్ రిఫరెన్స్, జియో న్యూస్, సమా స్పోర్ట్స్, జీఎన్ఎన్, ఉజైర్ క్రికెట్, ఉమర్ చీమా ఎక్స్‌క్లూజివ్, ఆస్మా షిరాజీ, మునీబ్ ఫరూఖ్, సునో న్యూస్ హెచ్‌డీ, రాజీ నామా లాంటి ప్రముఖ యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి.

Next Story