ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం అలర్ట్.. అమిత్ షాకు ప్రధాని మోడీ సంచలన ఆదేశం

by Gantepaka Srikanth |

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి(Terror Attack) జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) అప్రమత్తమైంది.

ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం అలర్ట్.. అమిత్ షాకు ప్రధాని మోడీ సంచలన ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి(Terror Attack) జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) అప్రమత్తమైంది. విషయం తెలిసిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)కు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఫోన్ చేశారు. పహెల్‌గామ్‌(Pahalgam)లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ దాడిలో గాయాలైన వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని ఆదేశించారు. దాడికి పాల్పడ్డ వారిని తక్షణమే గుర్తించి.. కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతేకాదు.. తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లాలని అమిత్ షాకు మోడీ ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు ఉగ్రదాడిపై కేంద్ర హోంశాఖ(Central Home Ministry) అత్యున్నత సమావేశం ఏర్పాటు చేసింది. అందుబాటులో ఉన్న ఉన్నతాధికారులతో అమిత్ షా సమావేశమయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు టూరిస్టులు మృతిచెందారని.. దీనిని సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. ఈ కాల్పుల్లో కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన పర్యాటకులు అధికంగా గాయపడ్డట్లు తెలిపారు. టూరిస్టులు ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో సడన్‌గా ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రమూకలు దాడులకు తెగబడ్డాయని చెప్పారు. ప్రస్తుతం దాడి జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. దాడికి పాల్పడింది తామేనని టీఆర్ఎఫ్ సంస్థ ప్రకటించడం సంచలనంగా మారింది.

Next Story