- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"ఆపరేషన్ మహాదేవ్" సైన్యం, పోలీసులకు ప్రతిష్టాత్మక అవార్డు
పహల్గామ్ లో ఉగ్రదాడికి పాల్పడినందుకు ప్రతీకారం తీర్చుకున్న భారత సైన్యానికి ఏక్తా దివస్ సందర్భంగా కేంద్ర హోం శాఖ అత్యుత్తమ పురస్కారాలు ప్రకటించింది.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్ లో ఉగ్రదాడికి పాల్పడినందుకు ప్రతీకారం తీర్చుకున్న భారత సైన్యానికి ఏక్తా దివస్ సందర్భంగా కేంద్ర హోం శాఖ అత్యుత్తమ పురస్కారాలు ప్రకటించింది. అలాగే వివిధ ఆపరేషన్లు, ఎంక్వైరీ, ఫోరెన్సిక్ సైన్స్ రంగాల్లో అసాధారణమైన ప్రతిభను కనబరిచిన 1466 మంది పోలీసులకు సైతం పురస్కారాలను ప్రకటించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పోలీసులు, కేంద్ర బలగాలు ప్రతిష్టాత్మకమైన "కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్ 2025"కు ఎంపికయ్యారు. పహగ్గామ్ ఉగ్రవాదుల ఏరివేత "ఆపరేషన్ మహాదేవ్"లో పాల్గొన్న 40 మంది జమ్ముూ &కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు.
కశ్మీర్ రేంజ్ ఐజీ వీకే బిర్దీ, శ్రీనగర్ సీనియర్ ఎస్పీ జీవీ సందీప్ చక్రవర్తి, జమ్మూ కశ్మీర్ కు చెందిన 19 మంది పోలీసులు దక్షతా పదక్ అవార్డుకు ఎంపికయ్యారు. 21 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది కూడా ఈ మెడల్ ను అందుకోనున్నారు.
ఇక తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్స్ లక్షణరావు, జాకబ్, ముగ్గురు ఇన్ స్పెక్టర్లు చంద్రబాబు, ఉపేందర్, తిరుపతి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆంధ్రాకు చెందిన ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, అడిషినల్ ఎస్పీ భీమా రావు, డీఎస్పీ ఆర్జీ జయసూర్య, ఎస్ఐ ఎండీ నసీరుల్లా, ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ ఫణిభూషణ్ దక్షతా పదక్ అవార్డుకు ఎంపికైనట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. కాగా.. 2024 నుంచి కేంద్రం ఈ అవార్డులను ప్రారంభించింది.






