- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం.. మెట్రో విస్తరణకు రూ.9,858 కోట్లు
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో..

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో.. మంత్రి వర్గం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో కేబినెట్ ఒకేసారి నాలుగు ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. మహారాష్ట్ర - గుజరాత్ ప్రజలకు ప్రత్యేక బహుమతులు సహా మొత్తం రూ.19,919 కోట్ల విలువైన ప్రాజెక్టుల్ని మోదీ సర్కార్ ఆమోదించింది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రొడక్షన్ కు రూ.7,280 కేటాయించినట్లు తెలిపారు. ఇది దేశంలో హైటెక్ మ్యాగ్నెట్లను తయారు చేసేందుకు తోడ్పడుతుంది. వీటిని ఎలక్ట్రిక్ వెహికల్స్, మొబైల్ ఫోన్లలో ఉపయోగిస్తారు. ఇప్పటి వరకూ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడుతుండగా.. తాజాగా తీసుకున్న నిర్ణయంతో స్వదేశీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రొడక్షన్ అందుబాటులోకి రానుంది. పుణె మెట్రో రైల్ పొడిగింపుకు ప్రాజెక్టుకు రూ.9,858 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 32 కిలోమీటర్ల మేర పుణెలో కొత్త మెట్రోలైన్ పనులు ప్రారంభం కానున్నాయి. అక్కడ ఖరడి నుంచి ఖడక్వాస్లా వరకు, నల్ స్టాప్ నుంచి మాణిక్ బాగ్ వరకు ఈ లైన్ ఉంటుంది. ఇది ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడే పుణె నివాసితులకు పెద్ద ఉపశమనంగా మారనుంది.
అలాగే దేవభూమి ద్వారక- కర్నాలస్ రైల్వే లైన్ డబ్లింగ్ కు ఆమోదం తెలిపింది. దీనికి రూ.1,457 కోట్లు కేటాయించింది. బద్లాపూర్ - కార్జత్ థర్డ్, ఫోర్త్ రైల్వే పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.






