Central Cabinet Meeting: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ‘జమిలి’ డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం

by Kema Shiva Kumar |

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది.

Central Cabinet Meeting: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ‘జమిలి’ డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ముఖ్యంగా ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ (One Nation.. One Election) డ్రాఫ్ట్ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. జమిలీ ఎన్నికల (Jamili Elections)పై దేశం అంతటా అన్ని రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతోన్న నేపథ్యంలో ఇవాళ కేబినెట్ మీటింగ్ (Cabinet Meeting) అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

అయితే, ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ ముసాయిదా బిల్లును కేంద్ర న్యాయ శాఖ (Central Department of Justice) రూపొందించింది. మరోవైపు జమిలి ఎన్నికలకు దాదాపు 32 రాజకీయ పార్టీలు అంగీకారం తెలుపగా.. మరో 13 పార్టీలు వ్యతిరేకించాయి. జమిలి ఎన్నికల బిల్లును ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకోవాలని మోడీ సర్కార్ భావిస్తోంది. 2027లో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభకు కూడా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Next Story