రెండు దశల్లో జన గణన.. జనాభా లెక్కలపై కేంద్రం కీలక అప్ డేట్

by Prasad Jukanti |   (  Updated:2025-12-02 13:27:05  IST  )

కులగణనపై కేంద్రం పార్లమెంట్ సాక్షిగా క్లారిటీ ఇచ్చింది.

రెండు దశల్లో జన గణన.. జనాభా లెక్కలపై కేంద్రం కీలక అప్ డేట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో జనగణన, కులగణనపై కేంద్ర ప్రభుత్వం బిగ్ అప్ డేట్ ఇచ్చింది. దేశంలో జనగణన (Census 2027) రెండు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. 2026 ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య మొదటి దశ, 2027 ఫిబ్రవరిలో రెండో దశ జనగణన జరుగుతుందని మంగళవారం లోక్ సభకు తెలిపింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ (Nityanand Rai)ఇవాళ లోక్ సభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. జనగణన మొదటి దశలో హౌస్ లిస్టింగ్ , సెన్సెస్, రెండో దశలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని తెలిపారు. లడ్డాఖ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని మంచుతొ కప్పబడే నాన్ -సింక్రోనస్ ప్రాంతాల్లో జనగణన 2026 నుంచి అక్టోబర్ 1 మధ్య జరుగుతుందని పేర్కొన్నారు.

కులగణన కూడా:

కులగణనపై కూడా నిత్యానంద్ రాయ్ అప్ డేట్ ఇచ్చారు. మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 30 రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించిన విధంగానే కుల గణన కూడా జనగణనతో పాటే జరుగుతుందని తెలిపారు.

డిజిటల్ రూపంలో లెక్కింపు:

దేశంలో జనాభా గణనకు 150 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని అందువల్ల ఇంతు ముందు నిర్వహించిన జనాభా లెక్కల నాటి అనుభవాలతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలతో పాటు వివిధ వర్గాల ద్వారా వచ్చిన ఇన్ పుట్‍లు, సూచనలను తదుపరి జనగణన కోసం పరిగణలోకి తీసుకుంటామని నిత్యానంద్ రాయ్ తెలిపారు.

Next Story