కేంద్రం కీలక ప్రకటన.. దేశ వ్యాప్తంగా సమ్మె విరమించిన డ్రైవర్లు

by Disha Web Desk 2 |
కేంద్రం కీలక ప్రకటన.. దేశ వ్యాప్తంగా సమ్మె విరమించిన డ్రైవర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: హిట్ అండ్ రన్ కేసుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికిప్పుడు ఈ చట్టం అమలు కాదని తేల్చి చెప్పింది. ట్రాన్స్‌పోర్టు సంఘాలతో చర్చలు జరిపిన తర్వాతనే కొత్త చట్టం అమలుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ట్రక్ డ్రైవర్లు వెంటనే సమ్మె విరమించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా కోరారు. మరోవైపు కేంద్రంతో చర్చల అనంతరం దేశ వ్యాప్తంగా ట్యాంకర్ డ్రైవర్లు సమ్మె విరమించారు. డ్రైవర్లంతా వెంటనే విధుల్లో చేరాలని ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ కోరింది. కేంద్రంలో జరిపిన చర్చలు సంతృప్తిని ఇచ్చాయని అసోసియేషన్ పేర్కొంది.

కాగా, కేంద్రం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ చట్టాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు ధర్నా చేపట్టారు. దీంతో వెంటనే కేంద్రం రంగంలోకి దిగి చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో ధర్నాను ఎట్టకేలకు విరమించారు. దీంతో ట్యాంకర్లు రోజులాగే నడించేందుకు మార్గం సుగమమైంది. ఈరోజు ఉదయం నుంచి ధర్నాకు పిలుపునివ్వడంతో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించాయి.

Next Story

Most Viewed