- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా రిజర్వేషన్ బిల్లు: వెనక్కి తగ్గని కేంద్రం.. ప్రత్యామ్నాయాలపై ఫోకస్!
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వ్యూహం మారుస్తోంది. బిల్లు ఆమోదం కోసం మోడీ సర్కార్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభలో ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు ఆమోదానికి అవసరమైన 2/3 మెజారిటీ లభించకపోవడంతో ఈ పరిణామం మోడీ సర్కార్‍కు బిగ్‍షాక్‍గా మారింది. అయితే బిల్లు (Women's Reservation Bill) వీగిపోయినప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం 2029 ఎన్నికలలోపు మహిళా రిజర్వేషన్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పనిలో ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
వ్యూహంపై ఉత్కంఠ:
ప్రతిపక్షాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటూనే బిల్లును ఆమోదింపజేసేందుకు మళ్ళీ ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని ఒకవేళ లోక్‌సభలో ఈ బిల్లును ఆమోదింపజేయడం అసాధ్యంగా మారితే భవిష్యత్తులో రాజకీయంగా దీనిని ఒక ప్రధానాంశంగా చేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మహిళా రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం రాజకీయంగా ఒక పెద్ద నంబర్స్ గేమ్‍గా మారింది. ప్రభుత్వానికి ఇది ఒక తాత్కాలిక ఎదురుదెబ్బే అయినా రాబోయే ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ అంశాన్ని మళ్లీ ఎలా తెరపైకి తేబోతోందని అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.






