వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్!

by Phanindra |

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేయనున్నారు. దీనికి కేంద్రం కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్!
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం డీలిమిటేషన్‌తో కూడా ముడిపడి ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కొన్నిరోజుల క్రితమే దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా చేపట్టాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. లడఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఈ ప్రక్రియ అక్టోబర్ 2026లో జరుగుతుంది. మిగతా దేశంలో 2027లో జరగనుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదంతా జరిగిన తర్వాత 2029లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ సమయానికి 2023లో పార్లమెంటు ఆమోదం పొందిన ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ లేదా మహిళా బిల్లులో ప్రతిపాదించిన 33 శాతం రిజర్వేషన్‌ను కూడా అమలు చేయాలని కేంద్రం అనుకుంటోందట. కొత్త జనాభా లెక్కలు వచ్చిన తర్వాతనే ఈ బిల్లు అమలు చేయడం కుదురుతుంది. అందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Next Story