ఆవును జాతీయ జంతువుగా ప్రకటించే ఆలోచన లేదు: కేంద్రం

by Phanindra |

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించే ఆలోచన లేదని, లోక్ సభలో కేంద్ర మంత్రి ఎస్‌పీ బాఘేల్ ఈ బదులిచ్చారు.

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించే ఆలోచన లేదు: కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించే ఆలోచన తమకు లేదని కేంద్ర సహాయ మంత్రి ఎస్‌పీ సింగ్ బాఘేల్ వెల్లడించారు. లోక్‌సభలో బీజేపీ నేత త్రివేంద్ర సింగ్ రావత్ అడిగిన ప్రశ్నకు బాఘేల్ రాతపూర్వకంగా బదులిచ్చారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 246(3) ప్రకారం, కేంద్ర-రాష్ట్రాల మధ్య లెజిస్లేటివ్ అధికారాలు పంచుకుంటాం. ఈ నిబంధనలను అనుసరించి జంతువుల పరిరక్షణ అంశం రాష్ట్రాల పరిధిలోనిది’ అని బాఘేల్ తెలిపారు. ఆవుల పరిరక్షణకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేపట్టిన పథకాలను బలోపేతం చేసేందుకు, 2014 డిసెంబరులో రాష్ట్రీయ గోకుల్ మిషన్‌ను కేంద్రం ప్రారంభించిందని ఆయన తెలిపారు. కాగా, రాజ్యసభలో బిహార్‌లో చేపట్టిన ఎస్ఐఆర్‌పై చర్చ జరగాలని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆందోళన చేశాయి. ఈ క్రమంలోనే చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో విపక్ష నేతలు వాకౌట్ చేశారు.

Next Story