- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Census: జనాభా లెక్కల తొలి దశ.. 2026 ఏప్రిల్ 1 నుంచి షురూ
రాబోయే జనాభా లెక్కల కోసం హౌస్ లిస్టింగ్ కార్యకలాపాలు 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతాయని మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: రాబోయే జనాభా లెక్కల కోసం హౌస్ లిస్టింగ్ కార్యకలాపాలు 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతాయని సెన్సస్ కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ (Mrityunjay Kumar Narayan) తెలిపారు. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ఆదివారం ఓ లేఖ రాశారు. గృహ గణన ప్రక్రియ మొదటి దశ జనాభా లెక్కల ప్రారంభాన్ని సూచిస్తాయని పేర్కొన్నారు. దీనికి ముందు సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్ల నియామకం జరుగుతుందని, వారికి పనిని షేర్ చేయడంతో పాటు రాష్ట్రాలు, జిల్లా పరిపాలనా విభాగాల సహకారంతో గణన కొనసాగుతుందని వెల్లడించారు.
ఈ సర్వేలో ఫోన్, ఇంటర్నెట్, వాహనాలు (సైకిల్, బైక్, కారు, జీప్, వ్యాన్), ఉపకరణాలు (రేడియో, టీవీ, ట్రాన్సిస్టర్) వంటి వివరాలు సేకరిస్తారు. అలాగే పౌరులను ధాన్యం వినియోగం, తాగునీరు, లైటింగ్, మరుగుదొడ్ల రకం, స్నాన, వంట గదుల సౌకర్యాలు, ఎల్పీజీ కనెక్షన్ల గురించి సైతం అడుగుతారు. దీనికి సంబంధించి ఇప్పటికే సెన్సస్ కమిషనర్ కార్యాలయం ప్రశ్నలను సిద్ధం చేసింది. కాగా, 16వ జనాభా లెక్కల ప్రక్రియ రెండు దశల్లో జరగనున్న విషయం తెలిసిందే. దీనితో పాటు కులగణన సైతం జరగనుంది.






