ఏప్రిల్‌ 1 నుంచి జనగణన

by B.Srinivas |

దేశంలో జనగణన 2027 తొలి దశ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఏప్రిల్‌ 1 నుంచి జనగణన
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో జనగణన 2027 తొలి దశ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2026 ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇళ్ల వివరాలను సేకరించనున్నట్లు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో వ్యక్తుల గురించి కాకుండా ఇళ్లు, ప్రాథమిక సౌకర్యాల వివరాలను మాత్రమే నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియలో వివరాలు వెల్లడించేందుకు ప్రతి రాష్ట్రానికి 30 రోజుల వ్యవధి ఉంటుందని, లెక్కింపు ప్రారంభించే ముందు 15 రోజులపాటు స్వీయ గణనకు అవకాశం కల్పించినట్లు పేర్కొంది.

రూ.11,718 కోట్ల బడ్జెట్‌..
ఈ జనాభా లెక్కింపు డిజిటల్‌ విధానంలో నిర్వహించనున్నారు. మొబైల్‌ యాప్‌ల ద్వారా జనాభా లెక్కల సమాచారాన్ని సేకరిస్తే స్వీయ గణనకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం 30లక్షల మంది సిబ్బందిని నియమించగా.. రూ.11,718 కోట్ల బడ్జెట్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇందులో భాగంగానే కుల గణన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. రెండో దశలో జనాభా లెక్కల సేకరణ 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1వరకు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. చివరగా దేశవ్యాప్త జనాభా లెక్కలు 2011లో నిర్వహించగా.. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2021 నాటి ప్రక్రియ వాయిదా పడింది.


Next Story