- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Census: రేపే ‘జనగణన’ నోటిఫికేషన్.. గెజిట్ విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం
2011 తర్వాత దేశంలో జనాభా లెక్కలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: 2011 తర్వాత దేశంలో జనాభా లెక్కలు (Census) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సోమవారం జారీ చేయనున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) తెలిపారు. జనాభా లెక్కల సన్నాహాలపై సమీక్షించేందుకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సహా ఇతర అధికారులతో అమిత్ షా ఆదివారం భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. గెజిట్ రిలీజైన అనంతరం జనాభా లెక్కల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది.
జనగణన రెండు దశల్లో జరగనున్నట్టు ఇప్పటికే కేంద్ర స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాల్లో 2026 అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుండగా, దేశంలోని మిగతా ప్రాంతాల్లో 2027 మార్చి నుంచి ప్రారంభం అవుతుంది. దీనితో పాటే కులగణన కూడా జరగనుంది. ఇంటింటికీ సర్వే నిర్వహించడానికి 34 లక్షల మంది సర్వేయర్లు, సూపర్‌వైజర్లను నియమించింది. వారు క్షేత్రస్థాయి నుంచి డేటాను సేకరిస్తారు. అలాగే లక్షా 30 వేల మంది జనాభా లెక్కల అధికారులను నియమిస్తారు. ఈ ఉద్యోగులందరూ జనాభా లెక్కల కోసం క్షేత్రస్థాయి సర్వే పూర్తి చేసి డేటాను సిద్ధం చేస్తారు. కాగా, ఇవి 16వ జనాభా లెక్కలు కావడం గమనార్హం.






