- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగాల్‌లో హింసపై సీఈసీ సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశం
పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతర హింసపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్ (West Bengal)లో చోటుచేసుకుంటున్న హింస్మాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ సీరియస్ అయ్యారుజ అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్, కేంద్ర సాయుధ పోలీసు దళాల (CAPF) డీజీలు క్షేత్రస్థాయిలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు. హింసను అరికట్టడంలో జిల్లా మెజిస్ట్రేట్లు, ఎస్పీలు, లీసు అధికారులదే పూర్తి బాధ్యత అని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు సుమారు 700 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే విధులు నిర్వర్తిస్తారని సీఈసీ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్‌లోని అసన్సోల్, హౌరా, సిలిగురి, జమురియా వంటి ప్రాంతాల్లో కార్యాలయాల దహనం, విధ్వంసక ఘటనలు చోటుచేసుకున్నాయి. కూచ్ బెహార్, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో రాజకీయ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర బలగాలు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నది.






