విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

by Malleboina Mahesh |   (  Updated:2025-05-13 06:24:50  IST  )

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను అధికారులు విడుదల చేసి వెబ్ సైట్‌లో అందుబాటు లో ఉంచారు

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను అధికారులు విడుదల చేసి వెబ్ సైట్‌లో అందుబాటు లో ఉంచారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2024–25 విద్యా సంవత్సరానికి 10 - 12 తరగతుల బోర్డు పరీక్షలను నిర్వహించింది. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం 24 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో 88.39 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో అత్యధికంగా విజయవాడ రీజీయన్‌లో 99.60 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరంతో పోలిస్తే 0.41 శాతం ఉత్తీర్ణత పెరిగింది. కాగా తాజా ఫలితాల్లో అత్యధికంగా విజయవాడ రీజీయన్ లో 99.60 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే తిరువనంతపురంలో 99.32, చెన్నైలో 97.39, బెంగళూరులో 95.95, ఢిల్లీ వెస్ట్ లో 95.37, ఢిల్లీ ఈస్ట్ లో 95.06, అత్యల్పంగా ప్రయాగ్ రాజ్ లో 79.53 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా ఈ CBSE 12వ తరగతి పరీక్షలు 2025 ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగాయి.

అధికారిక వెబ్‌సైట్

రిజల్ట్స్ కోసం cbseresults.nic.in లేదా cbse.gov.inని సందర్శించండి.

"Senior School Certificate Examination (Class XII) Results 2025" లింక్‌పై క్లిక్ చేయండి.

రోల్ నెంబర్, స్కూల్ నెంబర్, అడ్మిట్ కార్డ్ ID, పుట్టిన తేదీని ఎంట్రీ చేయడం ద్వారా ఫలితాన్ని చూసి, డౌన్‌లోడ్, ప్రింట్ తీసుకోవచ్చు

Next Story