అబ్దుల్ కరీం తుండాను నిర్దోషిగా ప్రకటించడంపై సుప్రీంకోర్టుకు సీబీఐ

by Dishanational1 |
అబ్దుల్ కరీం తుండాను నిర్దోషిగా ప్రకటించడంపై సుప్రీంకోర్టుకు సీబీఐ
X

దిశ, నేషనల్ బ్యూరో: 1993 వరుస రైలు పేలుళ్ల కేసులో అబ్దుల్ కరీం తుండాను అజ్మీర్‌లోని ప్రత్యేక కోర్టు నిర్దోషిగా ప్రకటించడాన్ని సీబీఐ సుప్రీంకోర్టులో సవాలు చేయనుందని అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ కేసులో ఇర్ఫాన్, హమీర్-ఉల్-ఉద్దీన్‌లతో సహా ఇప్పటివరకు 12 మందిని దోషులుగా నిర్ధారించారని, వీరికి గురువారం తీవ్రవాద, విధ్వంసక కార్యకలాపాల (నివారణ) చట్టం (టాడా) కోర్టు న్యాయమూర్తి మహావీర్ ప్రసాద్ గుప్తా జీవిత ఖైదు విధించారు. తుండాను నిర్దోషిగా విడుదల చేశారు. తీర్పును అధ్యయనం చేస్తున్నామని, త్వరలో సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేస్తామని సీబీఐ అధికారులు వెల్లడించారు. 1993 డిసెంబర్ 5-6 తేదీల మధ్య రాత్రి లక్నో, కాన్పూర్, హైదరాబాద్, సూరత్, ముంబైలలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సహా ఆరు రైళ్లలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. 22 మంది గాయపడ్డారు. ఐదు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన ఈ కేసు సీబీఐకి అప్పగించబడింది.


Next Story