NIA: ఖలిస్తాని ఉగ్రవాది తార్సేమ్ సింగ్‌ను భారత్‌కు తీసుకొచ్చిన కేంద్ర ఏజెన్సీలు

by S Gopi |
NIA: ఖలిస్తాని ఉగ్రవాది తార్సేమ్ సింగ్‌ను భారత్‌కు తీసుకొచ్చిన కేంద్ర ఏజెన్సీలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్తాని ఉగ్రవాది తార్సేమ్ సింగ్‌ను ఇంటర్‌పోల్ సహకారంతో ఫెడరల్ ఏజెన్సీలు శుక్రవారం యూఏఈలో ఫార్మాలిటీలను పూర్తి చేసి భారత్‌కు తీసుకొచ్చాయి. అతను కెనడాకు చెందిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషన్ల్(బీకేఐ) నాయకుడు లఖ్‌బీర్ లాండాకు సోదరుడు కూడా. తార్సేమ్ సింగ్‌ను భారత్‌కు తీసుకొచ్చిన వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదుపులోకి తీసుకుంది. 2022, మేలో మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటిల్జెన్స్ ప్రధాన కార్యాలయంలో రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ దాడికి ప్రాణాళిక రచించడం సహా దేశంలో బీకేఐ ఉగ్రవాద కార్యకలాపాలలో ముఖ్యుడిగా తార్సేమ్ సింగ్ ఉన్నట్టు కేంద్ర ఏజెన్సీ అధికారులు తెలిపారు. ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా ఇది పెద్ద విజయంగా పేర్కొన్న ఎన్ఐఏ.. 'పంజాబ్‌లోని తార్న్ తరణ్ నివాసి, నియమించబడిన ఉగ్రవాది లఖ్‌బీర్ లాండా యొక్క నిజమైన సోదరుడు. అతను బీకేఐలో కీలక సభ్యుడు. యూఏఈలో ఉన్న టెర్రరిస్టులు హర్విందర్ సింగ్ రిండా, లాండాలతో సంబంధం ఉన్న వ్యక్తి అని ' పేర్కొంది. గతేడాది నవంబర్‌లో తార్సేమ్ సింగ్‌పై రెడ్ నోటీసు జారీ చేశారు. అదే నెలలో యూఏఈ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story