- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Caste: కుల ఆధారిత ర్యాలీలు బ్యాన్.. యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
కుల వివక్షను అంతమొందించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కుల ఆధారిత రాజకీయ ర్యాలీలను నిషేధించింది.

దిశ, నేషనల్ బ్యూరో: కుల వివక్షను అంతమొందించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కుల ఆధారిత రాజకీయ ర్యాలీలను నిషేధించింది. అలాగే పోలీసు డాక్యుమెంట్స్, వాహనాలపై స్టిక్కర్లు, బహిరంగ ప్రదేశాల్లో కుల ప్రస్తావనలను బ్యాన్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ (Deepak kumar) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాహనాలు, సైన్ బోర్డుల నుంచి కుల చిహ్నాలు, నినాదాలు వెంటనే తొలగించాలని ఆదేశించారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పోలీసు రికార్డులు, నోటీసు బోర్డులు, ఎఫ్ఐఆర్ కాపీలో ఇకపై నిందితుడి కులాన్ని ప్రస్తావించొద్దు. అయితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద దాఖలైన కేసుల్లో దీనికి మినహాయింపు ఉన్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో కులతత్వాన్ని ప్రోత్సహించే లేదా ఏదైనా కులాన్ని కించపరిచే వారిపై కూడా చర్యలు తీసుకోనున్నారు. దీనికి గాను సామాజిక మాధ్యమాలను నిరంతరం పర్యవేక్షించనున్నారు. సమాజంలో కుల విభజనలను పెంచే ఏ ధోరణిని సహించబోమని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నిర్ణయంపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) స్పందించారు. 5000 ఏళ్లుగా లోతుగా పాతుకుపోయిన సామాజిక పక్షపాతాన్ని పరిష్కరించడానికి ఈ పరిపాలనా చర్యలు సరిపోతాయా అని ప్రశ్నించారు.






