- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
600 అడుగుల లోయలో పడిన కారు.. ఆరుగురు దుర్మరణం
600 అడుగుల లోయలో కారు పడటంతో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది.

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోరరోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన కల్వాన్ తాలూకా సప్తశ్రింగ్ గఢ్ ఘాట్‌లో జరిగింది. పింపల్‌గావ్ బస్వంత్ ప్రాంతానికి చెందిన ఆరుగురు ఆదివారం సాయంత్రం 4 గంటలకు కారులో వస్తుండగా.. అదుపు తప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న 600 అడుగుల లోతైన గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురూ అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు తెలిపారు.
మృతులను కీర్తి పటేల్ (50), రసీలా పటేల్ (50), విఠల్ పటేల్ (65), లతా పటేల్ (60), వచన్ పటేల్ (60), మణిబెన్ పటేల్ (70)గా గుర్తించారు. జిల్లా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి లోయలో పడిన కారును బయటకు తీశారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ విషాదం వ్యక్తంచేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా దీన్నొక తీవ్రమైన విషాద ఘటనగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రాష్ట్రప్రభుత్వం నుంచి పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.






