- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CDS: నిన్నటి ఆయుధాలతో నేటి యుద్ధం గెలవలేము.. సీడీఎస్ అనిల్ చౌహన్ కీలక వ్యాఖ్యలు
విదేశీ టెక్నాలజీపై ఆధారపడటం ప్రమాదకరం అని సీడీఎస్ అనిల్ చౌహన్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత రక్షణ సామర్థ్యాలపై సీడీఎస్ అనిల్ చౌహాన్ (CDS Anil Chauhan) కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి టెక్నాలజీని వినియోగించి ఇవాళ యుద్ధం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అందువల్ల భారత దేశం తన రక్షణ సామర్థ్యాలను (India defence capabilitie) ఆధునీకరించుకోవాల్సిన తక్షణ అవసరం ఉందన్నారు. ఢిల్లీలో జరిగిన రక్షణ రంగానికి సంబంధించిన వర్క్ షాప్ లో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మోడరన్ వార్ ఫేర్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రాముఖ్యతను వివరించారు. నిన్నటి ఆయుధ వ్యవస్థలతో నేటి యుద్ధాన్ని మనం గెలవలేమని.. భారత దేశం తన వ్యూహాత్మక కార్యకలాపాలకు కీలకమైన విదేశీ సాంకేతిక పరిజ్ఞానాలపై ఆధారపడటం ప్రమాదకరం అని వీటిపై ఆధారపడటం తగ్గించుకోవాలన్నారు. దిగుమతి చేసుకున్న సాంకేతికతలపై ఆధారపడటం వల్ల యుద్ధానికి మన సంసిద్ధత బలహీన పడుతుందని పేర్కొన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన కౌంటర్-యూఏఎస్ వ్యవస్థలు ఎందుకు కీలకమో ఆపరేషన్ సిందూర్ మనకు స్పష్టం చేసిందని మనల్ని మనం రక్షించుకోవడానికి స్వదేశీ సామర్థ్యాల్లో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.
పాక్ డ్రోన్స్ భారత్ కు నష్టాన్ని కలిగించలేదు:
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ డ్రోన్లు, మందుగుండు సామగ్రిని ఉపయోగించిందని అయితే అవి భారత డిఫెన్స్ వ్యవస్థకు ఎలాంటి నష్టాన్ని కలిగించలేదని అనిల్ చౌహన్ అన్నారు. వాటిలో ఏదీ కూడా భారత్ సైనిక లేదా పౌర మౌలిక సదుపాయాలపై ఎటువంటి నష్టం కలిగించలేదు. చాలా వరకు కైనిటిక్, నాన్ కైనటిక్ పద్దతుల్లో ఆ డ్రాన్లను కూల్చివేసామన్నారు. కొన్ని డ్రోన్లను రికవరీ చేశామని తెలిపారు. పాక్ ప్రయోగించిన డ్రోన్లను చాలా వరకు స్వదేశీ టెక్నాలజీతో నిర్మూలించామని తెలిపారు.






