- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కెనడాలో కొత్త పౌరసత్వ బిల్లు.. విదేశాల్లో బిడ్డలు పుట్టినా..!
కెనడాలో కొత్త పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టారు. విదేశాల్లో బిడ్డలు పుట్టినా కూడా కెనడియన్ పౌరసత్వం ఇచ్చేలా మార్పులు తెస్తున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: వారసత్వంగా కెనడియన్ పౌరసత్వం పొందే చట్టంలో ఉన్న పరిమితులను సడలిస్తూ కెనడా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ‘సీ-3’ అని నామకరణం చేసిన ఈ కొత్త బిల్లును ఆ దేశ పార్లమెంటులో ఇమిగ్రేషన్ మంత్రి లీనా మెట్లీజ్ డియాబ్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం, కెనడా ప్రజలు వేరే దేశంలో ఉన్నప్పుడు బిడ్డ పుడితే.. ఆ బిడ్డకు కెనడియన్ పౌరసత్వం దక్కదు. 2009లో చేసిన ఈ చట్టం కెనడాలో పుట్టిన తొలి తరం వారసులకు మాత్రమే తల్లిదండ్రుల నుంచి కెనడియన్ పౌరసత్వం అందుతుంది. అయితే విదేశాల్లో కెనడియన్లకు పుట్టిన పిల్లలకు కూడా పౌరసత్వం ఇచ్చేలా ఈ చట్టంలో మార్పులు చేయాలని లీనా ప్రతిపాదించారు. ఈ చట్టం లబ్ది పొందాలంటే సదరు పేరెంట్స్.. కెనడాలో కనీసం మూడేళ్లు నివశించి ఉండాలి. ఆ తర్వాత బిడ్డ వేరే దేశంలో పుట్టినా, దత్తత తీసుకున్నా తమ పౌరసత్వాన్ని ఆ బిడ్డకు అందించవచ్చు.
ప్రస్తుతం అమెరికాలో పుట్టిన వారికి ఆటోమేటిక్‌గా యూఎస్ పౌరసత్వం దక్కుతుందని చెప్పే ‘బర్త్ రైట్’ చట్టాన్ని ఇటీవలే ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే హెచ్1బీ, ఎఫ్1 వీసాలతో యూఎస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు.. ఆ దేశంలో పిల్లల్ని కన్నా వారికి పౌరసత్వం దక్కదని ప్రకటించారు. ఇలాంటి సమయంలో కెనడా ప్రభుత్వం అక్కడి పౌరసత్వ నిబంధనలు సడలీకరించడంతో భారతీయులతోపాటు పలుదేశాల వలసదారులు లబ్దిపొందుతారని నిపుణులు అంటున్నారు. పార్లమెంటు రివ్యూలో ఉన్న ఈ బిల్లు పాసయితే.. కెనడాలో ఉంటున్న భారతీయులు.. స్వదేశంలో బిడ్డలకు జన్మనిచ్చినా కెనడా పౌరసత్వాన్ని వారికి ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది.






