canada: విదేశీ ఉద్యోగులకు కెనడా గుడ్ న్యూస్.. ఓడబ్లూపీ రూల్స్ సడలింపు

by B.Srinivas |

ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన అనంతరం కెనడాలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

canada: విదేశీ ఉద్యోగులకు కెనడా గుడ్ న్యూస్.. ఓడబ్లూపీ రూల్స్ సడలింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో (Truedo) రాజీనామా చేసిన అనంతరం కెనడా (Canada)లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కెనడా ప్రభుత్వం ఓపెన్ వర్క్ పర్మిట్ (OWP) రూల్స్ సడలించింది. దీంతో అంతర్జాతీయ విద్యార్థులు, విదేశీ ఉద్యోగులు తమ జీవిత భాగస్వాములు ఓడబ్లూపీ కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నిబంధన జనవరి 21 నుంచి అమలులోకి రానుంది. ఈ మార్పులతో భారతీయ విద్యార్థులకు భారీ ప్రయోజనం కలగనుంది. చాలా మంది విద్యార్థులు తమ జీవిత భాగస్వాములను కెనడాకు తీసుకెళ్లే చాన్స్ ఉంటుంది. అయితే 16 నెలలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న మాస్టర్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్‌లు, ఎంపిక చేసిన ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకున్న అంతర్జాతీయ విద్యార్థుల జీవిత భాగస్వాములకు మాత్రమే ఇది వర్తిస్తుంది. విదేశీ ఉద్యోగి వారి జీవిత భాగస్వామి ఓడబ్లూపీకి దరఖాస్తు చేసినప్పుడు వారి వర్క్ పర్మిట్‌లో కనీసం 16 నెలలు మిగిలి ఉండాలి. కాగా, కెనడా ప్రభుత్వం 2004లో ఓడబ్లూపీపై పరిమితులు విధించడంతో విదేశీ విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Next Story