- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిహార్‌లో రెండో విడత ఎన్నికల ప్రచారం ముగింపు
బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన రెండో విడత ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. దీంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలను విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న (Bihar State Assembly Elections) ఎన్నికలకు సంబంధించిన రెండో విడత (Second phase) ఎన్నికల ప్రచారం (election campaign) ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. దీంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలను విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. ఈ విడతలో కీలకమైన అనేక నియోజకవర్గాలు ఉండటంతో, ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు చివరి నిమిషం వరకు పెద్ద ఎత్తున సభలు, రోడ్‌షోలు నిర్వహించారు. అభివృద్ధి, ఉద్యోగాలు, చట్ట వ్యవస్థ, సంక్షేమ పథకాలు వంటి అంశాలు ఈ ఎన్నికల చర్చల్లో ప్రధానంగా నిలిచాయి. ఈ నెల 11న రెండో విడత పోలింగ్‌లో మొత్తం 20 జిల్లాలకు చెందిన 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది.
ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. భద్రతా దళాలు, ఎన్నికల సిబ్బంది తుది ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీటీవీ పర్యవేక్షణ, మహిళా పోలింగ్ బూత్‌లు, ప్రత్యేక సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 122 స్థానాలకు మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యం 3.70 కోట్ల మంది ఓటర్ల చేతుల్లో ఉండనుంది. ఓటర్లు సమాజంలో మార్పు తీసుకురావడంలో చురుగ్గా పాల్గొనాలని ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఈ విడత పోలింగ్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.






