- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fat-Shamed: లావుగా ఉన్నావని ఇద్దరిపై కాల్పులు
లావుగా ఉన్నావన్నందుకు ఎగతాళి చేశాడని ఓ వ్యక్తి ఇద్దరిపై కాల్పులు జరిపాడు. ఉత్తరప్రదేశ్ లోని ఖజ్ని పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, నేషనల్ బ్యూరో: లావుగా ఉన్నావన్నందుకు ఎగతాళి చేశాడని ఓ వ్యక్తి ఇద్దరిపై కాల్పులు జరిపాడు. ఉత్తరప్రదేశ్ లోని ఖజ్ని పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెల్గాట్ ప్రాంతానికి చెందిన అర్జున్ చౌహాన్.. ఓ ఆలయంలో జరిగిన వేడుకకు హాజరయ్యాడు. అదే ఉత్సవంలో మంజారియాకు చెందిన అనిల్ చౌహాన్, శుభమ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు. ఉత్సవంలో ఉండగా.. వారిద్దరూ అర్జున్‌ను మోటూ అని పిలిచారు. లావుగా ఉన్నావని ఎగతాళి చేసి మాట్లాడారని వారిపై అర్జున్ కోపం పెంచుకున్నాడు. మరుసటి రోజూ అనిల్, శుభమ్ కారులో తమ స్వస్థలానికి బయల్దేరారు. ఈ క్రమం అర్జున్ తన స్నేహితుడైన ఆసిఫ్ ఖాన్‌తో కలిసి వారిని వెంబడించాడు. టెనువా టోల్ ప్లాజా వద్ద వారి కారును అడ్డుకున్న అర్జున్.. అనిల్, శుభమ్‌తో గొడవ పెట్టుకున్నాడు. ఈక్రమంలో సహనం కోల్పోయిన అర్జున్.. వారిద్దరిపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై శుభమ్ చౌహాన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేశారు. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిద్దరు క్షేమంగానే ఉన్నారని చెప్పారు.






