- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cabinet: నాలుగు మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
నాలుగు కొత్త మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: నాలుగు కొత్త మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టుల (Multi tracking Railway Projects)కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ భేటీలో రూ. 24,634 కోట్ల విలువైన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లోని 18 జిల్లాలను కవర్ చేస్తాయి. ఇందులో మధ్యప్రదేశ్‌లోని ఇటార్సి భోపాల్-బినా మార్గంలో 237 కిలోమిటర్ల పొడవైన నాలుగో లైన్, మహారాష్ట్రలోని వార్దా-భుసావల్‌లో 314 కిలోమీటర్లతో మూడో, నాలుగో లైన్ నిర్మించనున్నారు. అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లోని గోండియా అండ్ డోంగర్‌ఘర్ మధ్య 84 కిలోమీటర్లమీ నాలుగో లైన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని వడోదర - రత్లాం మధ్య 259 కిలోమీటర్ల మూడో, నాలుగో లైన్ నిర్మించనున్నారు.
ఈ ప్రాజెక్టులు భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్‌ను దాదాపు 894 కిలోమీటర్ల మేర పెంచుతాయని, ప్రజలు, వస్తువులు, సేవల కదలికకు సజావుగా కనెక్టివిటీని అందించడంలో సహాయపడతాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. లైన్ సామర్థ్యం పెరగడం వల్ల చలనశీలత గణనీయంగా పెరుగుతుందని, ఫలితంగా భారతీయ రైల్వేలకు కార్యాచరణ సామర్థ్యం మెరుగుపడుతుందని చెప్పారు. అలాగే రద్దీని తగ్గించడం, సమయాన్ని ఆదా చేయడం, రైల్వే సేవల విశ్వసనీయతను పెంచుతాయన్నారు.






