Cabinate: కేంద్రం కీలక నిర్ణయాలు.. ఉపాధి, క్రీడలకు భారీ కేటాయింపులు

by B.Srinivas |

దేశంలో తయారీని ప్రోత్సహించడానికి రూ.99,446 కోట్లతో ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం (ఈఎల్ఐ)ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

Cabinate: కేంద్రం కీలక నిర్ణయాలు.. ఉపాధి, క్రీడలకు భారీ కేటాయింపులు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో తయారీని ప్రోత్సహించడానికి రూ.99,446 కోట్లతో ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం (ఈఎల్ఐ)ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా రెండేళ్లలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. తయారీ రంగంలో ఉద్యోగాలను సృష్టించడమే ఈ పథకం లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పథకం కింద మొదటిసారి ఉద్యోగులు ఒక నెల వేతనం రూ. 15,000 వరకు పొందుతారు, అలాగే అదనపు ఉపాధిని సృష్టించినందుకు యజమానులకు రెండేళ్ల వరకు ప్రోత్సాహకాలు అందిస్తారు. అలాగే ఆర్డీఐ స్కీమ్, నేషనల్ స్పోర్ట్స్ పాలసీ, పరమకుడి-రామనాథపురం జాతీయ రహదారి విస్తరణకు సైతం మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

జాతీయ క్రీడా విధానం

గత దశాబ్దంలో భారత్ క్రీడా రంగం అద్భుతమైన వృద్ధిని కనబరుస్తున్నందున, జాతీయ క్రీడా విధానం (NSP) 2025కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశ క్రీడా దృశ్యాన్ని పునర్నిర్మించడం, క్రీడల ద్వారా పౌరులకు సాధికారత కల్పించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త క్రీడా విధానం నేషనల్ స్టోర్ట్స్ పాలసీ- 2001ని భర్తీ చేస్తుంది. నూతన విధానం 2036 ఒలింపిక్ క్రీడలు సహా అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలలో భారతదేశాన్ని సూపర్ పవర్‌గా మార్చడానికి దోహదపడుతుంది.

ఆవిష్కరణలకు ప్రోత్సాహం

పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ (ఆర్డీఐ) పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీనికి రూ.లక్ష కోట్లు కేటాయించింది. దీనిలో భాగంగా ప్రభుత్వం ఇంధన భద్రత, స్వచ్ఛమైన శక్తి, వాతావరణ మార్పు, క్వాంటం కంప్యూటింగ్, రోబోటిక్స్. అంతరిక్షం వంటి రంగాలపై దృష్టి సారించనుంది. అలాగే వ్యవసాయం, ఆరోగ్యం, విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI)ని కూడా చేర్చనుంది. ఇజ్రాయెల్, అమెరికా, సింగపూర్, జర్మనీ వంటి దేశాల్లో విజయవంతమైన ప్రపంచ నమూనాలను అధ్యయనం చేసిన తర్వాత అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ANRF) రూపొందించిన అంతర్జాతీయ రోడ్‌మ్యాప్ ఆధారంగా కేంద్రం దీనిని రూపొందించింది.

పరంకుడి-రామనాథపురం హైవే విస్తరణ

తమిళనాడులోని జాతీయ రహదారిలోని పరమకుడి-రామనాథపురం హైవేను నాలులు లేన్లుగా మార్చడానికి సైతం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రహదారిని రూ.1,853 కోట్ల వ్యయంతో అప్‌గ్రేడ్ చేయనున్నారు. రహదారి వ్యవస్థను మెరుగుపరచడానికి, కనెక్టివిటీని పెంచడానికి, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ఈ చర్య తీసుకున్నట్టు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

Next Story