- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
40 మంది ప్రయాణికులతో నదిలోకి దూసుకెళ్లిన బస్సు
బంగ్లాదేశ్ లో పెను విషాదం నెలకొంది. 40 మంది ప్రయాణికులతో ఓ బస్సు నదిలోకి దూసుకు వెళ్ళింది.

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ లో పెను విషాదం నెలకొంది. 40 మంది ప్రయాణికులతో ఓ బస్సు నదిలోకి దూసుకు వెళ్ళింది. బంగ్లాదేశ్ లోని దౌలత్ దియా టెర్మినల్ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. 40 మంది ప్రయాణికులతో ఉన్న ఓ బస్సు, ఫెర్రీ ఎక్కుతుండగా అదుపు తప్పింది. ఈ క్రమంలోనే పద్మా నదిలోకి దూసుకెళ్లింది. రేవు నుంచి బస్సు ఫెర్రీ ఎక్కుతుండగా మరో చిన్న పడవ వచ్చి, ఫ్లాట్ ఫామ్ ను బలంగా ఢీ కొట్టింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు.
దీంతో బస్సు వెళ్లి నేరుగా నదిలో పడిపోయింది. అయితే బస్సు నదిలో పడుతున్న క్రమంలో కొంతమంది తెలివిగా కిటికీల నుంచి బయటపడ్డారు. సుమారు 11 మంది ఈదుకుంటూ బయటపడినట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణించిన చాలా మంది గల్లంతయినట్లు చెబుతున్నారు స్థానికులు. ఈ సంఘటన జరగగానే రంగంలోకి దిగింది రెస్యూ టీం. ఇప్పటికే రెండు మృతదేహాలను వెలికి తీశారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.






