కర్నాటకలో ఘోర ప్రమాదం..తుక్కు తుక్కైన ఆటో..వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

కర్నాటకలో ఘెర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సుల మధ్యలో ఓ ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది.

కర్నాటకలో ఘోర ప్రమాదం..తుక్కు తుక్కైన ఆటో..వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: కర్నాటకలో ఘెర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సుల మధ్యలో ఓ ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది. రెండు బస్సుల మధ్య ఆటో ప్రయాణిస్తుండగా వెనక బస్సు ఆటోను ఢీ కొట్టింది. వేగంగా ఢీ కొట్టడంతో ఆటో పూర్తిగా నుజ్జు నుజ్జు అవ్వగా అందులో ప్రయాణిస్తున్న 4గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయ‌ప‌డ్డ‌వారు న‌వీన్, పూజ‌, నింగ‌రాజు, మ‌హంతేష్ గా గుర్తించారు.

ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే వారిని బ‌య‌ట‌కు తీసి స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప‌రిశీలించి డాక్ట‌ర్లు ప్రాణాల‌కు ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని హామీ ఇచ్చారు. ప్ర‌స్తుతం వారికి చికిత్స కొన‌సాగుతోంది. ఇక ప్ర‌మాదం జ‌రిగిన త‌ర‌వాత ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప‌రిస్థితిని ప‌రిశీలించారు. బ‌స్ డ్రైవర్ అతివేగం, నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగింద‌ని గుర్తించారు. డ్రైవ‌ర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. video

Next Story