- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైల్వే ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. ఒకే టికెట్‌పై 56 రోజుల ప్రయాణం! ఎన్ని రైళ్లైనా మారవచ్చు!!
దేశంలో అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ భారత రైల్వేది. ఇండియా నలుమూలల నుంచి రోజుకు లక్షలాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తుంది.

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ భారత రైల్వేది. ఇండియా నలుమూలల నుంచి రోజుకు లక్షలాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తుంది. అతి తక్కువ ఛార్జీలను వసూలు చేస్తూ పేద, మధ్య తరగతి ప్రజలకు చేయూతనిస్తుంది. ముఖ్యంగా తీర్ధయాత్రలు చేసేవాళ్లకు ఎన్నో వసతులను, రాయితీలసు కల్పిస్తూ భారతదేశాన్ని చుట్టి చూపుతుంది. తాజాగా రైల్వే శాఖ ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఒకే టికెట్‌పై రెండు నెలల పాటు ప్రయాణం చేయవచ్చని తెలిపింది. ఈ విధానం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ దీనిపై ప్రయాణికులకు సరైన అవగాహన లేదనే చెప్పాలి. రైల్వే శాఖ సైతం ఈ టికెట్ సౌకర్యంపై అవగాహన కల్పించలేదు.
రైల్వేశాఖ సర్క్యులర్ జర్నీ (Circular Journey Ticket) టికెట్‌ను ప్రవేశపెట్టింది. ఇది సాధారణ టికెట్లతో పోల్చితే పూర్తిగా భిన్నమైనది. సర్క్యులర్ జర్నీ టికెట్ యాత్రికులకు, నిత్యం బిజినెస్ టూర్లు, ట్రావెలింగ్ చేసే వాళ్లకు చక్కగా ఉపయోగపడుతుంది. ఈ సర్క్యులర్ జర్నీ టికెట్‌ను ఒకసారి కొనుగోలు చేస్తే దాదాపుగా రెండు నెలలు (56 రోజులు) ప్రయాణం చేయవచ్చు. ఎన్ని రైళ్లనైనా మారవచ్చు. అలాగే ఈ సర్క్యులర్ జర్నీ టికెట్ ధర పాయంట్ -టు-పాయంట్ ఛార్జీల కంటే తక్కువ. ఈ టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులు ఏ తరగతి బోగీలోనైనా ప్రయాణం చేయవచ్చు.
ఇదంతా బాగానే ఉన్నా.. సర్క్యులర్ జర్నీ టికెట్ కొనుగోలు చేయలంటే కొంత శ్రమ తప్పదు. దీనిని నేరుగా కౌంటర్ నుంచి కొనుగోలు చేయడానికి వీలుపడదు. సర్క్యులర్ జర్నీ టికెట్ కావాలంటే ముందుగా డివిజనల్ కమర్షియల్ మేనేజర్ లేదా స్టేషన్ మేనేజర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. వారికి మీ ప్రయాణ రూట్ మ్యాప్‌ను అందజేయాల్సి ఉంటుంది. మీ రిక్వెస్ట్‌ను మేనేజర్ ఓకే చేస్తేనే టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ సదుపాయం కూడా దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలోనే ఉన్నది. పూర్తి వివరాల కోసం సమీపంలోని రైల్వే స్టేషన్ ఎంక్వేరిని సంప్రదించవచ్చు.






