Xi Jinping: వేధింపులు, ఆధిపత్యం ప్రదర్శిస్తే ఒంటరిగా మిగిలిపోతారు- జిన్ పింగ్

by Shamantha N |

వాషింగ్టన్- బీజింగ్ వాణిజ్య ఒప్పందంపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. వేధింపులు, ఆధిప్యత ధోరణులు ప్రదర్శిస్తే.. ఒంటరిగా మిగిలిపోతారని అన్నారు.

Xi Jinping: వేధింపులు, ఆధిపత్యం ప్రదర్శిస్తే ఒంటరిగా మిగిలిపోతారు- జిన్ పింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: వాషింగ్టన్- బీజింగ్ వాణిజ్య ఒప్పందంపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. వేధింపులు, ఆధిప్యత ధోరణులు ప్రదర్శిస్తే.. ఒంటరిగా మిగిలిపోతారని అన్నారు. బీజింగ్‌లో లాటిన్ అమెరికన్, కరేబియన్ అధికారుల సమావేశంలో జిన్‌పింగ్ ప్రసంగించారు. ప్రపంచ దేశాల్లో మార్పులు వేగవంతం అవుతున్నాయని.. దేశాల మధ్య ఐక్యత, సహకారం అనివార్యం అని చెప్పుకొచ్చారు. అయితే, అమెరికా చైనా మధ్య టారీఫ్ లకు తాత్కాలిక విరామం ఇచ్చిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఎవరూ ఉండరని జిన్ పింగ్ మరోసారి నొక్కి చెప్పారు. అన్ని దేశాలు కలిసి పనిచేస్తేనే ప్రపంచ శాంతి.. సుస్థిరత సాధ్యమన్నారు.

టారీఫ్ ల ఉపసంహరణ

ఇటీవలే చర్చలు జరిగిన తర్వాత టారీఫ్‌లను ఉపసంహరించుకోవడానికి అమెరికా, చైనా అంగీకరించాయి. వాణిజ్య వివాదాలను పరిష్కరించుకోవడానికి, మరిన్ని చర్చలు జరిపేందుకు టారీఫ్‌ యుద్ధానికి 90 రోజుల విరామం ఇస్తున్నట్లు ఇరుదేశాలు సోమవారం ప్రకటించాయి. చైనా వస్తువులపై టారిఫ్‌ రేటును 115% తగ్గించామని, దీంతో 145% సుంకం కాస్తా 30 శాతానికి పరిమితమైందని యూఎస్‌ ట్రేడ్‌ రెప్రెజెంటేటివ్‌ జేమిసన్‌ గ్రీర్‌ ప్రకటించారు. అమెరికా వస్తువులపై చైనా కూడా తన సుంకాన్ని అంతేస్థాయిలో తగ్గించడంతో.. 125% కాస్తా 10 శాతానికి తగ్గింది. జెనీవాలో గ్రీర్, అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్‌ బెసెంట్‌ ఈ విషయాన్ని ప్రకటించారు.

Next Story