- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేబిస్ సోకిన గేదె.. దాని పాల ఉత్పత్తులు తిన్న 200 మంది
by Muthe.Rajitha |
యూపీలోని పిప్రౌలి గ్రామంలో ఓ ఘటన కలకలం రేపింది.

X
దిశ, వెబ్ డెస్క్ : యూపీలోని పిప్రౌలి గ్రామంలో ఓ ఘటన కలకలం రేపింది. ఓ అంత్యక్రియల అనంతరం ఏర్పాటు చేసిన భోజనాల్లో వడ్డించిన రైతాను సుమారు 200 మంది తిన్నారు. అయితే ఆ రైతా రేబిస్ సోకిన గేదె పాలతో తయారైనదిగా తేలింది. ఆ గేదె నుంచి సేకరించిన పాలతోనే పెరుగు తయారు చేయగా, కొద్ది రోజులకే ఆ గేదె రేబిస్‌తో మృతి చెందడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఆ భోజనాల్లో పాల్గొని రైతా తిన్న వారందరినీ గుర్తించిన అధికారులు అప్రమత్తమై, సుమారు 200 మందికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించారు. ఈ ఘటనతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు వైద్య, పశువైద్య శాఖలు చర్యలు చేపట్టాయి. అలాగే ఆ గేదెను పెంచిన రైతుపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






