చొరబాటును అడ్డుకున్న BSF జవాన్‌.. కిడ్నాప్‌ చేసిన బంగ్లాదేశీయులు

by Kema Shiva Kumar |

దేశంలోకి అక్రమ చొరబాటును అడ్డుకున్న బీఎస్ఎఫ్ (BSF) జవాన్‌ను బంగ్లాదేశీయులు కిడ్నాప్ చేసిన ఘటన పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలో సుతియార్, నూర్పూర్‌లోని బీఎస్ఎఫ్ క్యాంప్ సమీపంలో ఉన్న చందనీ చౌక్ వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

చొరబాటును అడ్డుకున్న BSF జవాన్‌.. కిడ్నాప్‌ చేసిన బంగ్లాదేశీయులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోకి అక్రమ చొరబాటును అడ్డుకున్న బీఎస్ఎఫ్ (BSF) జవాన్‌ను బంగ్లాదేశీయులు కిడ్నాప్ చేసిన ఘటన పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలో సుతియార్, నూర్పూర్‌లోని బీఎస్ఎఫ్ క్యాంప్ సమీపంలో ఉన్న చందనీ చౌక్ వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ వైపు నుంచి కాథలియా (Cathalia) గ్రామం సమీపంలో నవాజ్‌గంజ్ (Nawazganj) జిల్లాకు చెందిన కొందరు చొరబాటుకు ప్రయత్నిస్తుండగా అక్కడే పహారా కాస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ వారిని అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే దుండగులు ఎదురుతిరిగి జవాన్‌ను కిడ్నాప్ చేశారు. అనంతరం అతడిని కొన్ని గంటల పాటు బందీగా ఉంచారని.. బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB)తో మాట్లాడి జవాన్‌ను విడిపించామని దక్షిణ బెంగాల్ ఫ్రాంటియర్‌కు చెందిన ఓ సీనియర్ బీఎస్ఎఫ్ అధికారి వెల్లడించారు.

Next Story