- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Infiltration: భారత భూభాగంలోకి చొరబాటుకు యత్నించిన 26 మంది
భారత భూభాగంలోకి అక్రమంగా చొరబాటుకు యత్నించిన 26 మందిని సరిహద్దు భద్రతా దళం (BSF) అడ్డుకుంది. మన భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 24 మంది బంగ్లాదేశీయులు, ఇద్దరు రోహింగ్యాలను వెనక్కి పంపింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత భూభాగంలోకి అక్రమంగా చొరబాటుకు యత్నించిన 26 మందిని సరిహద్దు భద్రతా దళం (BSF) అడ్డుకుంది. మన భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 24 మంది బంగ్లాదేశీయులు, ఇద్దరు రోహింగ్యాలను వెనక్కి పంపింది. ఆదివారం ఉత్తర 24 పరగణాలు, నాడియా, మాల్డా జిల్లాల్లో జరిగింది. ఉత్తర 24 పరగణాలు జిల్లా నుండి 20 మంది బంగ్లాదేశీయులు, ఇద్దరు రోహింగ్యాలను బంగ్లాదేశ్‌కు బలవంతంగా వెనక్కి పంపించారు. నాడియా జిల్లాలో మరో నలుగురు బంగ్లాదేశీయుల్ని వెనక్కి పంపారు. అయితే, చొరబాటు దారులు ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో లేబర్, హౌస్ కీపింగ్ పనికోసం వెళ్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
చొరబాటుకు యత్నించిన స్మగ్లర్ల బృందం
అంతకుముందు, పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలోని బంగ్లాదేశీయులు స్మగ్లింగ్ కు యత్నించారు. దీంతో, అప్రమత్తమైన సరిహద్దు భద్రతా దళాలు స్మగ్లర్లను అడ్డుకున్నాయి. బీఎస్‌ఎఫ్ జవాన్లు పలుమార్లు హెచ్చరించినప్పటికీ 15 నుంచి 20 మందితో కూడిన స్మగ్లర్ల బృందం భారత సరిహద్దులవైపునకు దూసుకొచ్చింది. మారణాయుధాలతో జవాన్లపై దాడి చేశారు. దీంతో, జవాన్లు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. అదనపు బలగాలు మోహరించడంతో స్మగ్లర్లు పారిపోయారు.. 572 ఫెన్సిడైల్ బాటిల్స్, హైబీమ్ ప్లాష్ లైట్, ఆయుధాలు లభ్యం అయ్యాయి. పశ్చిమబెంగాల్ లోని పలు ప్రాంతాల్లో సరిహద్దు అవుట్‌పోస్టులలో ఇలాంటి స్మగ్లింగ్స్, చొరబాటు యత్నాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే, బీఎస్ఎఫ్ అధికారులు స్థానిక పోలీసు స్టేషన్లలో నివేదికలు దాఖలు చేశారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను సంబంధిత అధికారులకు అప్పగించారు.






