- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళను నమ్మించి.. మందు తాగించి.. చచ్చేవరకు ప్రైవేట్ పార్ట్స్‌పై దాడి చేసి.. దారుణ హత్య..
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కిషన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ ప్రైవేట్ పార్ట్స్‌పై దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించగా పూర్తి వివరాలు తెలుసుకుందాం. నిందితుడు సర్వేష్ నిషాద్ (25).. మహిళ నీతూ దేవిని

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కిషన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ ప్రైవేట్ పార్ట్స్‌పై దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించగా పూర్తి వివరాలు తెలుసుకుందాం. నిందితుడు సర్వేష్ నిషాద్ (25).. మహిళ నీతూ దేవిని నమ్మించి కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత మద్యం తాగించాడు. మత్తులో తూగి పడిపోయేంత వరకు మందు తాగించాడు. ఆ తర్వాత ముఖంపై దాడి చేసిన వ్యక్తి.. కింద పడేసి కొట్టాడు. అనంతరం ప్రైవేట్ పార్ట్స్‌లో చేయి చొప్పించి.. అవయవాలు డ్యామేజ్ అయ్యేంత వరకు దారుణంగా టార్చర్ పెట్టాడు. చనిపోయే వరకు వదలకుండా నరకం చూపించాడు. ఆనవాలు తెలియకుండా ఉండేలా శరీరంపై దాడి చేశాడు. శవాన్ని దమ్హా కాలువ దగ్గర్లోని పొదల్లో పడేశాడు.
అయితే దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. అసలు విషయం బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. తన తండ్రిని నీతూ దేవి విషం పెట్టి చంపిందనే అనుమానంతో హత్య చేసినట్లు వెల్లడించాడు. ప్రతీకారం కోసమే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చాడు.






