- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణ ఘటన.. బిడ్డను చంపి, తల్లిపై గ్యాంగ్ రేప్
చట్టాలు ఎంత కఠినతరం చేసిన దేశంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు మాత్రం ఆగటం లేదు.

దిశ, వెబ్ డెస్క్: చట్టాలు ఎంత కఠినతరం చేసిన దేశంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు మాత్రం ఆగటం లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాల ప్రకారం.. సగటున రోజుకి వందకి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా హర్యానాలో (Haryana) దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. భర్త లేని సమయంలో ఇంట్లోకి చొరబడి ఐదేళ్ల చిన్నారిని చంపేసి, వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్లితే..
హర్యానా రాష్ట్రంలోని జీంద్ (Jind) మురికివాడలో ఓ మహిళ భర్త నలుగురు పిల్లలతో నివసిస్తుంది. మంగళవారం రాత్రి ఆమె భర్త బయటకి వెళ్లాడని గమనించిన నలుగురు దుండగులు వారి గుడిసెలోకి చొరబడ్డారు. ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రపోతున్న ఆ మహిళపై దాడి చేశారు. ఆమెతోపాటు ఐదేళ్ల చిన్నారిని పక్కనే ఉన్న చెత్తకుప్ప వద్దకు ఎత్తుకెళ్లి.. చిన్నారిని గొంతునులిమి హత్య చేశారు. అనంతరం ఆమెపై నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితురాలిని అక్కడే వదిలేసి పారిపోయారు. చిన్నారి మృతదేహం రాత్రంతా చెత్తకుప్పలోనే ఉంది. బుధవారం ఉదయం స్థానికులు బాధితురాలిని గమనించి, ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
గురువారం స్పృహలోకి వచ్చిన బాధితురాలు జరిగిన దారుణాన్ని పోలీసులకు వెల్లడించింది. ఈ మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో అమిత్ అనే వ్యక్తితోపాటు ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చిన్నారిపై కూడా అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నామని, పోస్ట్ మార్టమ్ పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే నిర్ధరిస్తామని చెప్పారు. అయితే 15 రోజుల క్రితం బాధితురాలి భర్తకు పక్కనే స్థానికంగా అక్కడే ఉండే అమిత్ అనే వ్యక్తితో పాటు అతడి స్నేహితులతో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఆమె భర్త తలకు తీవ్ర గాయం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అమిత్తో పాటు అతడి స్నేహితులు బాధితురాలి కుటుంబంపై కక్ష పెంచుకున్నారు.






