- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెక్నికల్ ఇష్యూతో అకౌంట్లోకి రూ.40 కోట్లు.. ఆపై రూ.1.25 కోట్లు లాభం.. కోర్టు ఏం చెప్పిందంటే
టెక్నికల్ ఇష్యూతో ఒక ట్రేడర్ అకౌంట్లోకి రూ.40 కోట్లు జమ అయ్యాయి. వాటితో అతను 20 నిమిషాల్లో రూ.1.75 కోట్ల లాభం పొందాడు.

దిశ, వెబ్‌డెస్క్: టెక్నికల్ ఇష్యూతో ఒక ట్రేడర్ అకౌంట్లోకి రూ.40 కోట్లు జమ అయ్యాయి. వాటితో అతను స్టాక్స్ లో పెట్టుబడి పెట్టగా రూ.1.75 కోట్లు లాభం పొందాడు. ఇదంతా 20 నిమిషాల వ్యవధిలో జరగడం గమనార్హం. కాసేపటికే కోటర్ సెక్యూరిటీస్ అతని అకౌంట్లో జమ అయిన సొమ్మును తిరిగి ఇవ్వాల్సిందిగా కోరింది. కొంతకాలానికి అతను కోటక్ నుంచి తన అకౌంట్లో జమ అయిన రూ.40 కోట్లు ఇచ్చేశాడు. కానీ.. సదరు కంపెనీ అంతటితో ఊరుకోక.. తమ డబ్బుతో సంపాదించిన రూ.1.75 కోట్లను కూడా తమకే ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇందుకు అతను ఒప్పుకోకపోవడంతో న్యాయం కోసం ఇరువర్గాలు బాంబే హైకోర్టును ఆశ్రయించాయి.
ఆ డబ్బు అతను సొంత రిస్క్ పై సంపాదించాడు
2022లో జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కోటక్ సెక్యూరిటీస్ నుంచి వచ్చిన డబ్బుతో సంపాదించిన రూ.1.75 కోట్ల లాభం అతనికే చెందుతుందని తీర్పునిచ్చింది. దీనివల్ల తమ సంస్థకు ఎలాంటి నష్టం జరగలేదన్న విషయాన్ని కోటక్ సెక్యూరిటీస్ గుర్తించాలని సూచించింది. పైగా ఆ డబ్బు అతను అన్యాయంగా సంపాదించింది కూడా కాదని, సొంత రిస్క్ పై పెట్టుబడి పెట్టడంతో లాభం కూడా అతనికే చెందుతుందని స్పష్టం చేసింది. కాగా.. తమ డబ్బుతో సంపాదించిన రూ.1.75 లక్షలు తమకు ఇచ్చేస్తే రూ.50 లక్షలు ఇస్తామని కోటక్ ఆఫర్ చేయగా దానిని కూడా ట్రేడర్ రిజెక్ట్ చేశారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 4కు వాయిదా పడింది.






