British Singer Ed Sheeran : బ్రిటీష్ సింగర్ కు పోలీసుల సడన్ షాక్ !

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-02-10 13:00:14.0  )
British Singer Ed Sheeran : బ్రిటీష్ సింగర్ కు పోలీసుల సడన్ షాక్ !
X

దిశ, వెబ్ డెస్క్: భారత దేశ పర్యటనలో ఉన్న ప్రముఖ బ్రిటీష్ సింగర్ ఎడ్ షీరన్(British Singer Ed Sheeran) తన గానంతో ప్రజలను సర్ ప్రైజ్ చెద్దామనుకుంటే బెంగళూరు పోలీసు(Bangalore Police)లు మాత్రం ఆయనకు చేదు అనుభవం(Bitter experience) మిగిల్చారు. బెంగళూరు(Bangalore)లోని చర్చి స్ట్రీట్‌లో ప్రముఖ సింగర్ ఎడ్ షీరన్ తన బృందంతో కలిసి రహదారి పక్కన సర్‌ప్రైజ్ మ్యూజికల్ పెర్ఫార్మెన్స్(Surprise musical performance) ఏర్పాటు చేసుకుని పాటలు పాడటం మొదలు పెట్టాడు.

అతను పాటలు పాడుతుండగానే అటుగా వచ్చిన ఓ పోలీస్ అధికారి(Police Officer)వారి పాటల ఫోగ్రామ్ ను చూశాడు. ట్రాఫిక్ కు ఇబ్బంది కల్గించేలా రోడ్డు పక్కన మీ ప్రదర్శన ఏమిటని మండిపడ్డారు. వెంటనే ప్రదర్శనను నిలిపివేసి.. అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా సింగర్ బృందాన్ని ఆదేశించారు. అయితే తమ సర్ ప్రైజ్ పెర్ఫార్మెన్స్ కు అనుమతి ఉందని సింగర్ బృందం వివరించింది. అయితే ఆ పోలీసు అధికారి సింగర్ బృందం మాటలు వినిపించుకోకుండా మ్యూజిక్ ఫోగ్రామ్ ను భగ్నం చేసి, సంగీత వాయిద్య పరికరాలను, సౌండ్ సిస్టమ్ ను తొలగించి వేశాడు.

ఇదంతా చూసిన స్థానికులు, అభిమానులు మాత్రం పోలీసు అధికారి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను ఆహ్లాద పరిచేందుకు విదేశీ సింగర్ బృందం చేసిన ప్రయత్నాన్ని భగ్నం చేయడంలో పోలీసు అధికారి అతిగా వ్యవహరించి అత్సుత్సాహం ప్రదర్శించడాన్ని స్థానికులు మండిపడ్డారు. కాగా బ్రిటీష్ సింగర్ ఎడ్ షీరన్ బృందంతో పాటలు బాగున్నాయంటూ వారు అభినందించారు. పోలీస్ అధికారి ప్రవర్తన దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ విమర్శించారు.

అయితే పోలీసులు మాత్రం సింగర్ బృందం ప్రదర్శనకు అనుమతి ఉందన్న వాదనను కొట్టిపారేశారు. మొత్తం మీద సంగీత అభిమానుల కోసం తాను చేసిన చిన్న మధురమైన ప్రదర్శన అనుకోకుండా ఎడ్ షీరన్ కు చేదు అనుభవాన్ని కల్గించడం పట్ల అభిమానులు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు.

Next Story

Most Viewed