BRICS : జులై 6, 7 తేదీల్లో బ్రెజిల్ లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు

by Shamantha N |

బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్‌ (Brazil)లోని రియో డి జనీరోలో జరుగనుంది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి మౌరో వియోరా పేర్కొన్నారు.

BRICS : జులై 6, 7 తేదీల్లో బ్రెజిల్ లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్‌ (Brazil)లోని రియో డి జనీరోలో జరుగనుంది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి మౌరో వియోరా పేర్కొన్నారు. జులై 6, 7 తేదీల్లో దీన్ని నిర్వహించనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. బ్రిక్స్ దేశాల అభివృద్ధి, సహకారం సహా పలు అంశాలపై ఈ సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. వాణిజ్య కూటమిలోని ఇతర సభ్యులలో రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా, ఇతరులు ఉన్నారు.

గణనీయంగా విస్తరించిన బ్రిక్స్

2009లో ప్రారంభమైనప్పటి నుండి బ్రిక్స్ గ్రూపు గణనీయంగా విస్తరించింది. ఇప్పుడు ఇరాన్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు కూడా ఇందులో ఉన్నాయి. గతేడాది అక్టోబరులో రష్యాలోని కజాన్ నగరం వేదికగా ఈ సదస్సు జరిగింది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi), రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin), చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సహా పలువురు దేశాధినేతలు హాజరయ్యారు. మరోవైపు, బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీ రూపొందించడంపై దృష్టి సారించాలని పుతిన్ ఆ సదస్సులో పిలుపునిచ్చారు. ప్రస్తుతం కూటమిలోని దేశాలు డిజిటల్‌ కరెన్సీ వాడుకునేందుకు భారత్‌తో కలిసి రష్యా పని చేస్తుందన్నారు. ఈ ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) ఆగ్రహం వ్యక్తం చేశారు. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని వాడకంలోకి తెస్తే ఆ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామంటూ హెచ్చరించారు.

Next Story