BREAKING: లైంగిక వేధింపుల కేసులో మరో కీలక పరిణామం.. ప్రజ్వల్ రేవణ్ణకు బెయిల్ మంజూరు

by Kema Shiva Kumar |

కర్ణాటకలో సంచలనం సృష్టించిన ఎంపీ లైంగిక వేధింపుల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

BREAKING: లైంగిక వేధింపుల కేసులో మరో కీలక పరిణామం.. ప్రజ్వల్ రేవణ్ణకు బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో సంచలనం సృష్టించిన ఎంపీ లైంగిక వేధింపుల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందుతుడైన హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు రూ.5 లక్షల పూచికత్తుపై బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, రేవణ్ణ కస్టడీ రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాలు సెక్స్ స్కాండల్ రూపంలో ఒక్కసారిగా తెరమీదకు వచ్చాయి. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోలు దేశ వ్యాప్తంగా దుమారం రేపగా.. తాజాగా బాధితులు మాట మార్చిన వీడియోలు వైరల్ అవుతోంది. ఇంట్లో పని చేసే 60 ఏళ్ల మహిళపై ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు గతంలో వచ్చాయి.

ఆ మహిళను వేధిస్తున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే విషయం బయటకు పొక్కకుండా ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్‌డీ రేవణ్ణ, తన అనుచరుడి చేత సదరు మహిళను కిడ్నాప్ చేయించాడని కర్ణాటక పోలీసులు వెల్లడించారు. అనంతరం మైసూరు జిల్లాలోని హున్‌సూరులో హెచ్‌డీ రేవణ్ణ సహాయకుడి ఇంటి నుంచి ఆ మహిళను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విడిపించింది. మరోవైపు తన తల్లిని హెచ్‌డీ రేవణ్ణ కిడ్నాప్ చేయించాడంటూ సదరు మహిళ కుమారుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ మహిళ ఇప్పుడు మాట మార్చింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఇబ్బందిపెట్టలేదని ఆమె చెబుతున్నట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతోంది. తాజా పరిణామాలతో కేసులో వాదోపవాదాలు విన్న బెంగళూరు కోర్టు ప్రజ్వల్ రేవణ్ణకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story